గతంలో బీహార్ రాష్ట్రము అంటే రౌడీ రాజ్యానికి పుట్టినిల్లులా ఉండేది. కానీ ఇప్పుడిప్పుడే అక్కడ పరిస్థితులు మారుతున్నాయి. ఈ రాష్ట్రంలో నేర చరిత్ర ఉన్న వారు ఎన్నికలలో పోటీ చేయడం వల్ల వారి ప్రభావం ఎన్నికలకే పరిమితం కావటం లేదు, పాలనపైనా పడుతోంది. తాజాగా బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే బయటపడింది. బిహార్ రెండో విడత అసెంబ్లీ ఎన్నికలు వచ్చే నెల 3 న జరుగనున్నాయి. ఇక్కడ పోటీచేస్తున్న అభ్యర్థుల్లో 34శాతం మంది అంటే 1463 మందిపై క్రిమినల్ కేసులు ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.