రాష్ట్రవ్యాప్తంగా సామాజిక పింఛన్ తీసుకునే లబ్ధిదారులందరికీ కరోనా టెస్ట్ చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇందులో నిర్బంధం ఏమీ లేదు. అలా నిర్బంధంగా టెస్ట్ చేయడానికి ఏ చట్టమూ ఒప్పుకోదు. అందులోనూ పింఛన్ ఇవ్వడానికి, కరోనా టెస్ట్ కి సంబంధం కూడా లేదు. స్వచ్ఛందంగా ముందుకొచ్చినవారికి సచివాలయాల్లో ఏఎన్ఎం ఆధ్వర్యంలో కరోనా టెస్ట్ చేయిస్తారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఈ ప్రక్రియ ప్రారంభమైంది.