తాజాగా అన్ లాక్ మార్గదర్శకాలను నవంబర్ 30వరకు పొడిగిస్తున్నట్టు తెలిపిన కేంద్ర ప్రభుత్వం, కంటైన్మెంట్ జోన్ల బయట అన్నిరకాల కార్యకలాపాలకు అనుమతిస్తున్నట్లు మరోసారి స్పష్టం చేసింది. కరోనా కేసులు తగ్గుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఉదారంగానే ఉన్నా.. సెకండ్ వేవ్ అంటూ వార్తలొస్తున్న వేళ.. మరింత ఉదాసీనత పనికి రాదని అంటున్నారు నిపుణులు. వ్యాక్సిన్ వచ్చేవరకు స్వీయ నియంత్రణ అవసరం అని, ప్రభుత్వ ఆంక్షలు లేకపోతే ప్రజలు స్వీయ నియంత్రణ పాటించడం అసంభవం అని హెచ్చరిస్తున్నారు.