ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు దూకుడు మీద ఉన్నారు. జైలు నుంచి వచ్చాక ఆయన వర్షన్ పూర్తిగా మారినట్లు కనబడుతోంది. మామూలుగానే అచ్చెన్నాయుడు దూకుడుగా ఉంటారు. ప్రత్యర్ధి పార్టీ వైసీపీ అంటే ఒంటికాలి మీద వెళ్తారు. జగన్పై ఓ రేంజ్లో ఫైర్ అవుతారు. అయితే ఈ ఫైర్ అంతా ఈఎస్ఐ స్కామ్లో జైలుకు వెళ్ళి వచ్చాక తగ్గిపోయింది. జైలు నుంచి వచ్చాక అచ్చెన్న ప్రభుత్వంపై పెద్దగా విమర్శలు చేయలేదు.