ఏపీ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమారు...పేరుకు ఎలక్షన్ కమిషనర్ అయినా, ఓ రాజకీయ నాయకుడు లాగా ఆయన టీడీపీకి అనుకూలంగా ఉంటారని అధికార వైసీపీ నేతలు ఎప్పటి నుంచి విమర్శలు చేస్తూనే ఉన్నారు. అసలు నిమ్మగడ్డకు, అధికార వైసీపీకి ఏ మాత్రం పొసగడం లేదు. ఎప్పుడైతే నిమ్మగడ్డ ప్రభుత్వాన్ని అడగకుండా స్థానిక సంస్థల ఎన్నికలని వాయిదా వేశారో అప్పటి నుంచి, ఎస్ఈసిభ వర్సెస్ వైసీపీ అన్నట్లుగా ఏపీలో రాజకీయం మారిపోయింది. తమని సంప్రదించకుండా నిమ్మగడ్డ ఎన్నికల వాయిదా వేయడం పట్ల అధికార వైసీపీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుందో తెలిసిందే.