మాస్కు ధరించమని చెప్పిన ఓ సెక్యూరిటీ గార్డు దారుణంగా కత్తితో పొడిచారు. ఈ ఘటన చికాగోలో చోటు చేసుకుంది. ముఖానికి మాస్కులు, చేతికి శానిటైజరు వాడమని చెప్పినందుకు చికాగోలో ఓ దుకాణం సెక్యూరిటీ గార్డు (32)ను ఇద్దరు అక్కాచెల్లెళ్లు 27 మార్లు కత్తితో పొడిచారు. జెస్సికా హిల్ (21), జైలా హిల్ (18) అనే అక్కాచెల్లెళ్లు ఆదివారం పొద్దుపోయాక ఈ దాడికి పాల్పడ్డారు.