వైసీపీ ప్రభుత్వం పేదల అపార్ట్ మెంట్లపై స్పష్టమైన అభిప్రాయం చెప్పింది. పేదలకు ఇచ్చే ఇళ్లకు ఎలాంటి రుణాలు లేకుండా అన్నీ మాఫీ చేస్తామని చెబుతున్నార మంత్రులు, ఎమ్మెల్యేలు. గత ప్రభుత్వం బ్యాంకు రుణాలంటూ పేదలపైనే భారం మోపిందని, నాశిరకం అపార్ట్ మెంట్లు నిర్మించి పేదల జేబులు కొట్టిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. జగన్ సర్కారు అపార్ట్ మెంట్ల కేటాయింపుపై త్వరలో తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశమున్నట్టు తెలుస్తోంది. పూర్తిగా రుణమాఫీ చేసి అపార్ట్ మెంట్లను లబ్ధిదారులకు అందించేందుకు జగన్ ప్రభుత్వం కసరత్తులు చేస్తున్నట్టు సమాచారం.