నెల్లూరు జిల్లాలో హెలికాప్టర్ ల్యాండింగ్ స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఎలాంటి అనుమతులు లేకుండానే ఓ హెలికాప్టర్ ల్యాండ్ అవడంతో అధికార యంత్రాంగం ఆశ్చర్యపోయింది. ఏ ప్రాంతంలో అయినా హెలికాప్టర్ ల్యాండ్ కావాలంటే ఏవియేషన్ అనుమతితో పాటు స్థానిక పరిపాలన అధికారి అనుమతి తప్పనిసరిగా ఉండాలి.