ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి కేశుభాయ్ పటేల్ స్వర్గీయులయ్యారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అహ్మదాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ రోజు ఉదయం ఆయన ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించింది. వైద్యులు చికిత్స అందించినా ఆయన ప్రాణాలు కాపాడలేకపోయారు.