ఐపీఎల్ మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో పలు ప్రాంతాల్లో బెట్టింగ్ జోరుగా సాగుతుంది. ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లాలో ఆన్లైన్ ద్వారా బుక్కీలు జోరుగా బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. ఒక సినిమా థియేటర్ వెనుక భాగంలో దందా సాగిస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. వారిలో 11మందిని అరెస్ట్ చేసి వారిపై కేసు నమోదు చేసారు.