అవసరమైతే అనుకున్న టైమ్ కి పూర్తి చేసే విధంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని కేంద్రానికి అప్పగిస్తామని అన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. చంద్రబాబు నాయుడులాగా దోపిడీ చేయడం, ధన దాహం కోసం రాష్ట్రానికి జీవనాడి అయిన ప్రాజెక్టును తాకట్టు పెట్టే ఆలోచనలు తాము చేయబోమని చెప్పారు. 2018లోగా పోలవరం పూర్తి చేస్తామని తొడలు కొట్టిన చంద్రబాబు తర్వాత ఏంచేశారని మండిపడ్డారు. అంచనా వ్యయం పెంచేందుకు కేంద్రం ససేమిరా అంటే.. పోలవరం నిర్మాణం బాధ్యతను వారికే అప్పగించే ఆలోచన చేస్తామన్నారు. ఒకరకంగా నిర్మాణ వ్యయాన్ని తగ్గించాలని చూస్తున్న కేంద్రంకోర్టులోకే వైసీపీ బంతిని నెట్టేసినట్టయింది.