కరోనా ప్రభావంతో అన్ని వ్యాపారాలు దాదాపుగా దెబ్బతిన్నాయి. అయితే బంగారం తాకట్టు పెట్టుకునే సంస్థల వ్యాపారం మాత్రం రెట్టింపు స్థాయిలో జరుగుతోందట. ప్రైవేట్ సంస్థలతోపాటు, బ్యాంకుల్లో కూడా బంగారం తాకట్టు వ్యవహారం బాగా పెరిగిపోయినట్టు తెలుస్తోంది. లాక్ డౌన్ తర్వాత కొత్తగా ఉపాధి మార్గాలు వెతుక్కుంటున్నవారికి పెట్టుబడికోసం బంగారం ఆసరాగా మారింది. అందుకే చాలామంది ఇప్పుడు బంగారాన్ని తాకట్టు పెట్టి రుణాలు తీసుకోడానికి ఆసక్తి చూపిస్తున్నారని, గడచిన నెలరోజుల్లో వీరి శాతం 20కి పైగా పెరిగిందని అంటున్నారు.