రాష్ట్రంలో నవంబర్ 2 నుంచి పాఠశాలలు, కళాశాలలు తెరుచుకుంటున్నా.. 1 నుంచి 5వ తరగతి వరకు.. అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ మాత్రం డిసెంబర్ 14 నుంచి మాత్రమే మొదలవుతుంది. అప్పటికి రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితి మరింత చక్కబడుతుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వ్సోతంది. నవంబర్ 2నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో మూడు దశల్లో రోజు విడిచి రోజు తరగతులు నిర్వహిస్తారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని షెడ్యూల్ విడుదల చేశారు.