చంద్రబాబు హయాంలో కేంద్రం నుంచి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద 7 లక్షల ఇళ్లకు అనుమతి వచ్చింది. దాన్ని రాష్ట్ర పథకంతో కలిపి ఎన్టీఆర్ గృహకల్ప పేరుతో అపార్ట్ మెంట్లు నిర్మించింది టీడీపీ ప్రభుత్వం. అయితే ఈ అపార్ట్ మెంట్ల నిర్మాణంలో అవకతవకలు జరిగాయని, చదరపు అడుక్కి కనీసం 500 రూపాయలు పేదల దగ్గరనుంచి అదనంగా వసూలు చేస్తున్నారని వైసీపీ నేతలు గతంలోనే ఆరోపించారు. ఇప్పుడు చంద్రబాబు ఈ ఇళ్ల విషయంలో ప్రభుత్వాన్ని నిందిస్తుండే సరికి.. మరోసారి వైసీపీ నేతలు కాస్త గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు చెప్పినట్టు 6 లక్షల ఇళ్లు చూపించాలని మంత్రి బొత్స సవాల్ విసిరారు.