కొత్తగా వచ్చే పింఛన్ల దరఖాస్తుల్లో ఆధార్ కార్డులో వయసుకు సంబంధించి జరిగిన మార్పులు, చేర్పుల వివరాలను తప్పనిసరిగా పరిశీలించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అనర్హులు లబ్ధి పొందకుండా ఈ కొత్త నిబంధన తీసుకొచ్చినట్టు అధికారవర్గాలు తెలిపాయి. కొత్త నిబంధన ప్రకారం పింఛనుకు దరఖాస్తుచేసుకునేవారు తమ ఆధార్ కార్డు అప్డేట్ హిస్టరీ ని కూడా సమర్పించాలి. ఆధార్ కార్డ్ జిరాక్స్ తోపాటు, హిస్టరీ ప్రింట్ అవుట్ కూడా దరఖాస్తుతో జతచేయాలి. మార్పులు, చేర్పులు జరిగి ఉంటే.. ఆధార్ కార్డులో తక్కువ వయసును పరిగణనలోకి తీసుకుంటారు.