ఏపీలో నవంబర్ 2 నుంచి స్కూళ్ల ప్రారంభంపై పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలు రూపొందించింది. కరోనా నేపథ్యంలో విద్యార్థులకు, టీచర్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేలా చర్యలు చేపడుతున్నారు. ఒక్కో తరగతి గదిలో 16 మందికి మించకుండా ఉండాలని నిర్ణయించారు. విద్యార్థుల మధ్య దూరం కనీసం 6 అడుగులు ఉండేలా సీటింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. రోజువిడిచి రోజు తరగతుల నిర్వహణ, ఆన్లైన్, ఆఫ్ లైన్ బోధన తదితర అంశాలను మార్గదర్శకాల్లో పొందుపరిచారు.