హైదరాబాద్ లో వరదసాయం పంపిణీపై విమర్శలు తలెత్తుతున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 33 కోట్ల రూపాయలు పరిహారంగా అందించాల్సి ఉంది. ఇప్పటి వరకూ 14 కోట్ల రూపాయలు బాధితులకు పంచేసినట్టు రికార్డులు చెబుతున్నాయి. విచిత్రం ఏంటంటే.. పంచిన 14కోట్లలో.. సగం డబ్బు అంటే 7 కోట్ల రూపాయలు తిరిగి నేతలు, వారి అనుచరుల జేబుల్లోకే వెళ్లిపోయాయట. వరద నీటితో నష్టపోయిన వారికి కాకుండా అనర్హులకు ఇచ్చారని బాధితులు ఆందోళనకు దిగారు. సాయం ఇచ్చినట్టే ఇచ్చి కమిషన్ అడుగుతున్నారని వాపోతున్నారు.