ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రైవేట్ స్కూల్స్ నుంచి ప్రభుత్వ బడుల్లోకి మారే విద్యార్థులకు టీసీలు లేకుండానే అడ్మిషన్లు ఇవ్వాల్సిందిగా సిబ్బందిని ఆదేశించింది. ప్రైవేట్ స్కూల్స్.. తమ అడ్మిషన్లు పోతున్నాయనే బాధతో.. టీసీలు ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయి. దీంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. టీసీ లేకపోయినా పర్వాలేదు కేవలం ఆధార్ నెంబర్ తోనే అడ్మిషన్ ఇవ్వండని విద్యాశాఖ అధికారులకు మంత్రి ఆదిమూలపు సురేష్ సూచించారు. దీంతో ఏపీలో చాలామంది విద్యార్థులకు ఊరట కలిగినట్టయింది.