ప్రస్తుతం రైతుల పరామర్శ యాత్రకు కాస్త విరామం ఇచ్చిన లోకేష్.. సెకండ్ ఫేజ్ లో ఉత్తరాంధ్రలో సుడిగాలి పర్యటన చేయబోతున్నారట. ఉత్తరాంధ్రవాసులంతా అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని కోరుకుంటున్నట్టు వారి మధ్య ఏకాభిప్రాయం తెచ్చేందుకు కృషి చేస్తారట. ఆ తర్వాత రాయలసీమలో కూడా లోకేష్ పర్యటించి.. సీమ వాసుల అభీష్టాన్ని కూడా తెలుసుకుంటారట. ఈ పర్యటనలతో అమరావతిపై ఎలాంటి అభిప్రాయం ఉందనే విషయాన్ని లోకేష్ తెలుసుకున్నట్టు అవుతుంది. దాని ద్వారా అమరావతికి కట్టుబడి ఉండటం లాభమా నష్టమా అనే అంచనాకు టీడీపీ వస్తుందని తెలుస్తోంది.