ఉన్నత విద్యపై అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం జగన్.. ప్రైవేట్ యూనివర్శిటీ అడ్మిషన్లపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రైవేటు విశ్వవిద్యాలయాల అనుమతులు, పర్యవేక్షణ పటిష్ఠంగా ఉండాలని అధికారులకు సూచించారు. ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో కూడా 50శాతం కన్వీనర్ కోటా అమలు చేయాలని జగన్ ఆదేశించారు. మొత్తం సీట్లలో కన్వీనర్, యాజమాన్య కోటా 50శాతం చొప్పున ఉండాలని సూచించారు.