ఫుట్పాత్లు, వీధుల్లో వస్తువులు, తినుబండారాలు విక్రయించే చిరు వ్యాపారులకు రూ.10 వేల చొప్పున రుణాలు అందించే కార్యక్రమమే ‘జగనన్న తోడు’. ఈ పథకాన్ని ఈ నెల 6వ తేదీనుంచి సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయ శాఖ కమిషనర్ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఈ పథకం కింద బ్యాంకుల నుంచి చిరు వ్యాపారులకు రుణాలు ఇప్పించడంతోపాటు ఆ రుణాలపై అయ్యే వడ్డీ మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది.