2021 జనవరినాటికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కి ఎన్నికలు జరగాల్సి ఉంది. 2016లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ 99 సీట్లు సాధించింది. ఎంఐఎం 44, బీజేపీ 4, కాంగ్రెస్ 2, టీడీపీ 1 స్థానం దక్కించుకున్నాయి. ఈసారి సెంచరీ దాటాలని కేటీఆర్ ఉత్సాహపడుతున్నారు. అయితే బీజేపీ, ఎలాగైనే టీఆర్ఎస్ ను దెబ్బకొట్టాలని చూస్తోంది. ఇటీవల వరద విలయం నేపథ్యంలో టీఆర్ఎస్ ప్రతిష్ట దిగజారిందని, ఇదే అదనుగా బీజేపీ దూసుకుపోతుందని అంచనా వేస్తున్నారు నేతలు. అయితే వీటికితోడు క్రౌడ్ పుల్లింగ్ కోసం బలమైన నాయకుడిని బల్దియా ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్ గా చేయాలని చూస్తున్నారు బీజేపీ నేతలు. పవన్ కల్యాణ్ ని రంగంలోకి దించుతున్నారు.