కరణం బలరామకృష్ణమూర్తి వర్సెస్ ఆమంచి కృష్ణమోహన్. చీరాలలో ఫైటింగ్! ఇదీ తాజాగా అన్ని పత్రికల్లోనూ వచ్చిన వార్త. ఇంత వరకు బాగానే ఉంది. కానీ, ఎవరు ఎవరిపై పైచేయి సాధించాలని ప్రయత్నిస్తున్నారు. ఈక్రమంలో ఎవరు తెరవెనుక ఉండి నడిపిస్తున్నారు? అనే ప్రశ్న సహజంగానే వైసీపీలో తెరమీదికి వచ్చింది. టీడీపీలో సీనియర్ మోస్ట్ అయిన కరణం బలరాం. గత ఏడాది ఎన్నికల్లో చీరాల ఎన్నికల్లో విజయం సాధించారు. అనంతరం తన కుమారుడు వెంకటేష్ భవిత కోసం అంటూ.. ఆయన టీడీపీని వీడి.. వైసీపీకి మద్దతు దారుగా మారిపోయారు. ఇంతవరకు అందరికీ తెలిసిన స్టోరీనే!