నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు....గెలిచింది వైసీపీలో...ఇప్పుడు అదే పార్టీకి ప్రత్యర్ధిగా మారిన నాయకుడు. 2019 ఎన్నికల ముందు టీడీపీలో సీటు ఖాయమైన సరే, ఆ పార్టీ అధికారంలోకి రాదని చెప్పి రాజుగారు వైసీపీలో చేరి, జగన్ వేవ్‌లో గెలిచేశారు. కానీ గెలిచిన దగ్గర నుంచి అదే వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ప్రతిపక్ష టీడీపీ కంటే ఎక్కువగానే జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు.