వంగవీటి రాధాకృష్ణ..విజయవాడ రాజకీయాల్లో కీలకమైన నేత. ముఖ్యంగా తన తండ్రి రంగా బాటలో నడుస్తూ, కాపు సామాజికవర్గానికి పెద్ద దిక్కుగా నడుచుకుంటున్న నాయకుడు. సొంతంగా మంచి ఫాలోయింగ్ ఉన్న నేత. అయితే సామాజికవర్గ పరంగా మంచి ఫాలోయింగ్ ఉన్న రాధాకు రాజకీయంగా మాత్రం పెద్దగా కలిసిరాలేదనే చెప్పొచ్చు. మొదట కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన రాధా...2004 ఎన్నికల్లో వైఎస్సార్ వేవ్‌లో కాంగ్రెస్ తరుపున పోటీ చేసి విజయవాడ తూర్పు నుంచి పోటీ చేసి గెలిచారు.