ఎన్నో ఏళ్ళు టీడీపీకి కంచుకోటగా ఉన్న గుడివాడ నియోజకవర్గం కొడాలి నాని అడ్డాగా మారిపోయిన విషయం తెలిసిందే. కొడాలి నాని ఎంటర్ కాకముందు వరకు ఇక్కడ టీడీపీ గెలుపుకు తిరుగులేదు. కొడాలి సైతం టీడీపీ నుంచి రెండుసార్లు విజయం సాధించి, సొంత ఇమేజ్ తెచ్చుకున్నారు. అయితే ఒక్కసారిగా కొడాలి టీడీపీని వీడి వైసీపీలోకి జంప్ కొట్టి, గుడివాడలో టీడీపీకి కోలుకులేని దెబ్బ వేశారు.