నెల్లూరు జిల్లా వైసీపీకి కంచుకోట అనే సంగతి తెలిసిందే. జిల్లా మొదట నుంచి టీడీపీకి పెద్దగా కలిసి రాలేదు. వైఎస్సార్ హయాంలో ఇక్కడ కాంగ్రెస్ నడవగా, ఇప్పుడు జగన్ హయాంలో వైసీపీ హవా కొనసాగుతుంది. రాష్ట్రంలో టీడీపీ గాలి ఉన్న 2014 ఎన్నికల్లో సైతం ఇక్కడ వైసీపీనే సత్తా చాటింది. మొత్తం జిల్లాలో 10 సీట్లు ఉంటే వైసీపీ 7 గెలుచుకోగా, టీడీపీ మూడు సీట్లు గెలుచుకుంది. ఇక ఉన్న ఎంపీ సీటు వైసీపీ ఖాతాలోనే పడింది.