ఏపీలో బీజేపీ డబుల్ గేమ్ ఆడుతుందా? అంటే అబ్బో బీజేపీ ఎప్పటినుంచో అదే పనిలో ఉందని రాజకీయం తెలిసిన ప్రతిఒక్కరూ చెబుతారు. ఎందుకంటే బీజేపీ-టీడీపీ పొత్తు విడిపోయిన దగ్గర నుంచి బీజేపీ రాజకీయం వేరుగానే ఉంటుంది. 2019 ఎన్నికల్లో బీజేపీ, చంద్రబాబుని ఓడించాలని కంకణం కట్టుకుని మరీ పనిచేశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, హామీలు, ప్రత్యేక హోదా లాంటి అంశాలు నెరవేర్చలేదు గానీ, రాష్ట్రంలో రాజక్రీయ క్రీడ మాత్రం బాగానే ఆడారు.