ఏపీలో మూడు మెగా పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలపడంతో వాటి ద్వారా సుమారు 39 వేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. పరోక్షంగా మరో లక్షమందికి ఉపాధి మార్గం దొరికినట్టవుతుంది. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో సీఎం జగన్ మూడు మెగా పరిశ్రమల ఏర్పాటుకి ఆమోదం తెలిపారు.