పట్టణాల తరహాలో గ్రామాల్లో కూడా ప్రతిరోజూ మంచినీటి సరఫరాకు వీలుగా ఇంటింటికీ నీటి కొళాయి ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఏపీలో మొత్తం 17,494 గ్రామాలు ఉండగా.. ప్రస్తుతం 389 గ్రామాల్లోనే వంద శాతం ఇళ్లకు నీటి కొళాయిలు ఉన్నాయి. వచ్చే నాలుగేళ్లలో రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో అన్ని ఇళ్లకు మంచి నీటి కొళాయి కనెక్షన్లు ఏర్పాటు చేసేందుకు వీలుగా ప్రభుత్వం అధికారులను సిద్ధం చేస్తోంది.