టిడ్కో ఇళ్ల వ్యవహారంలో చంద్రబాబు ప్రజల్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ‘నా ఇల్లు నా సొంతం, నా స్థలం నాకు ఇవ్వాలి’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఆందోళనలు నిర్వహించాలని, ఇళ్లు స్వాధీనం చేసేవరకూ బాధితుల తరఫున పోరాడాలని పార్టీ నేతలకు ఆయన పిలుపు ఇచ్చారు. అదే సమయంలో సంక్రాంతి నాటికి పేదల ఇళ్లన్నీ ప్రభుత్వం వారికి స్వాధీనం చేయకపోతే.. ప్రజలే వాటిని ఆక్రమించుకుంటారని కూడా హెచ్చరించారు. ఒకరకంగా ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారాయన.