రాష్ట్రంలో టీడీపీ పరిస్థితి ఎలా ఉందో ఆ నేతల పరిస్థితి కూడా అలానే తయారవడం ఇప్పుడు టీడీపీ ని కలవర పెడుతుంది. చంద్రబాబు వృద్ధుడు కావడంతో పార్టీ ని నడిపించే నాయకుడు లేకపోవడంతో తమ్ముళ్లు కొంత అయోమయానికి గురవుతున్నారు.. పార్టీ లో ఎలాంటి కార్యకలాపాలు జరగకపోవడం తో పాటు టీడీపీ నేతలు కూడా మిన్నకుండి పోవడం తో టీడీపీ భవిష్యత్ ఎలా ఉంటుందో అని వాపోతున్నారు.. ఇప్పటికే కొన్ని నియామకాలు, పార్టీ అధ్యక్షుడు మార్పు వంటివి ప్రజల్లోకి వెళ్లినా దాంతో పెద్దగా ఉపయోగం లేకపోవడంతో తమ్ముళ్లు ఏం చేస్తే పార్టీ మళ్ళీ ఫామ్లోకి వస్తుందో ని మల్లగుల్లాలు పడుతున్నారు..