ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష పార్టీ ల ఎత్తులు కొంత అపహాస్యంగా, నవ్వుతెప్పించే విధంగా ఉన్నాయి. ముఖ్యంగా టీడీపీ జగన్ పై చేసే అతి కి ప్రజలకు నవ్వుకుంటున్నారు.. వచ్చే ఎన్నికల్లోనూ తాము గెలవలేమని తెలిసిన టీడీపీ కి ప్రతి విషయంలో జగన్ ను విమర్శించడం ఎంతవరకు విజ్ఞత వారికే తెలియాలి.. ప్రజలకు దగ్గరవ్వాలంటే ప్రజల సమస్యలు గుర్తించి ప్రభుత్వం పై పోరాడాలి తప్పా ఇలా అన్నిటికి సీఎం జగన్ కారణమంటే ఎలా అని ప్రజల్లోనే ఓ వర్గం వాదిస్తున్నారు.. ఇక ఇటీవలే ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కింజరాపు అచ్చెన్నాయుడు పేరును టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారన్న సంగతి తెలిసిందే.. ఆయనైతే ముఖ్యమంత్రి అయిపోయినట్లుగా జగన్ ను విమర్శిస్తున్నారు..