ఏపీలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. అధికార పార్టీగా ఉన్న వైసీపీ మరింత దూకుడు ప్రదర్శిస్తుంది. టీడీపీని ఎక్కడకికక్కడే దెబ్బకొట్టేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. ఇటు టీడీపీ సైతం అధికార వైసీపీని జనాల్లో నెగిటివ్ చేసి, పుంజుకోవాలని ప్రయత్నిస్తుంది. అందుకే చంద్రబాబు అండ్ బ్యాచ్ నిత్యం జగన్ ప్రభుత్వం టార్గెట్గా విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు.