గెలిచింది వైసీపీలో మాట్లాడేది టీడీపీకి అనుకూలంగా...ఇదే గత కొన్ని నెలలుగా నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు వర్షన్. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎంపీగా గెలిచిన రాజుగారు...కొన్ని నెలల నుంచి అదే పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ...స్వపక్షంలో విపక్ష నేతగా మారారు. ప్రతిరోజూ ఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి, జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే ఉన్నారు.