జగన్ భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రతిపక్షాలు ఆయన్ని టార్గెట్ చేసి రాజకీయం చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ప్రతిపక్ష టీడీపీ, జగన్ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని వ్యతిరేకించింది. ప్రతి పథకంపై విమర్శలు చేశారు. అలాగే ప్రతి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పోరాటాలు చేస్తున్నారు. నిత్యం ఏదొకవిషయంలో జగన్పై విమర్శలు చేస్తూనే ఉన్నారు. జగన్ని ఎన్ని రకాలుగా నెగిటివ్ చేయాలో అన్ని రకాలుగా నెగిటివ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.