జగన్ అధికారంలోకి వచ్చాక ప్రజలకు అనేక సంక్షేమ పథకాలని అందిస్తున్న విషయం తెలిసిందే. వరుస పెట్టి జగన్ పథకాలు అందిస్తూ వస్తున్నారు. ఇప్పటికే మేనిఫెస్టోలోని 90 శాతం హామీలని అమలు చేశారు. అయితే ఇందులో జగన్ ఇచ్చిన అతి పెద్ద హామీల్లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం, ఇళ్ళు కట్టి ఇవ్వడం. ఇందులో మొదటగా పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించుకుంది. పట్టణాల్లో పేదలకు ఒక సెంటు, గ్రామాల్లో సెంటున్నర ఇవ్వాలని అనుకున్నారు. మొత్తం 25 లక్షల మందికి పైనే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం భావించింది.