అంతర్ రాష్ట్ర ఒప్పందంలో భాగంగా ఏపీఎస్ఆర్టీసీ తెలంగాణలో కోల్పోయిన లక్ష కిలోమీటర్ల సర్వీసుల్ని సొంత రాష్ట్రంలో పెంచుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అంటే.. ఇకపై ఏపీలో ఏపీఎస్ఆర్టీసీ లక్ష కిలోమీటర్ల మేర ఎక్కువగా సర్వీసుల్ని కవర్ చేస్తుందనమాట. రాష్ట్రంలో డిమాండ్ ఉన్న అంతర్గత రూట్లపై ఆర్టీసీ అధికారులు సర్వే మొదలు పెట్టారు. అంతర్ రాష్ట్ర సర్వీసుల్లో డిమాండ్ ఉన్న కర్ణాటక, తమిళనాడుకు భారీగా బస్సుల సంఖ్య పెంచబోతున్నారు. విజయవాడ–విశాఖపట్టణం మధ్య ఆర్టీసీ, ప్రైవేటు ట్రావెల్స్ ఆపరేషన్స్ పై కూడా సర్వే చేసిన అధికారులు ఈ మార్గంలో బస్సులు పెంచేందుకు నిర్ణయించారు.