కరోనా కారణంగా ఆలస్యంగా తెరుచుకున్నా కూడా పాఠశాలలకు వెళ్లేందుకే విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. కృష్ణా జిల్లా మినహా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో 100 శాతం ఉన్నత పాఠశాలలు తెరుచుకున్నాయని అన్నారాయన. రాష్ట్రంలో 1,11,177 మంది ఉపాధ్యాయులకుగాను 99,062 మంది పాఠశాలలకు హాజరయ్యారని తెలిపారు.