ప్రపంచ దేశాలను గజగజ వణికించే కరోనా..... దేశ ఆర్థిక పరిస్థితిని అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే... అయితే ఇప్పుడిప్పుడే అన్నీ సర్దుకుంటున్నాయి.... అటు కరోనా వ్యాప్తికి కూడా వేగాన్ని తగ్గించింది. ఇక కరోనా కేసులు విషయానికొస్తే... దేశంలో కరోనా వ్యాప్తి క్రమ క్రమంగా తగ్గుతుందనే చెప్పాలి. అయితే దేశ ప్రజలంతా కాస్త ఊపిరి పీల్చుకుంటున్న ఇటువంటి సందర్భంలో... కరోనా సెకండ్ వేవ్ మొదలు అయ్యే సూచనలు కనపడుతున్నాయి అన్న వార్త ప్రజలను కలవరపెడుతోంది.