డైట్ సెట్ రాయకుండా డైట్ కళాశాలల్లో అడ్మిషన్ తీసుకుని డీఈడీ విద్యను అభ్యసించిన విద్యార్థులకు అన్యాయం జరగకుండా చూడాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించబోతున్నారు. డైట్ సెట్ ప్రవేశ పరీక్షల్లో అర్హత సాధించని విద్యార్థులు, అసలు పరీక్షకే హాజరు కాని విద్యార్థులకు సైతం ప్రైవేటు డైట్ కళాశాలల యాజమాన్యాలు అడ్మిషన్లు ఇచ్చి కాలేజీల్లో చేర్పించుకున్నాయి. అలా చేరిన వేలాది మంది విద్యార్థులు ప్రస్తుతం ప్రభుత్వ నిబంధనల ప్రకారం పరీక్షలకు అనర్హులుగా మిగిలారు. అయితే వీరందరినీ ఈ ఏడాదికి అనుమతించాలని సీఎం జగన్ నిర్ణయించినట్టు తెలుస్తోంది.