తిరుమల కొండపైకి పాత వాహనాలను నిషేధిస్తున్నట్టు తిరుమల అడిషనల్ ఎస్పీ మునిరామయ్య వెల్లడించారు. పదేళ్లు పూర్తి చేసుకున్న వాహనాలను ఇకపై తిరుమలకి అనుమతించేది లేదని స్పష్టం చేశారు. పాతవి, ఫిట్నెస్ లేని వాహనాలకు తిరుమల ఘాట్ రోడ్లపై నిషేధం విధిస్తున్నట్లు పేర్కొన్నారు. 2010 కంటే ముందు రిజిస్టరైన వాహనాలను తిరుమలకు తీసుకురాకూడదని, ఫిట్నెస్ లేని వాహనాలను తిరుమలకు అనుమతించేది లేదని ఆయన వెల్లడించారు.