కరోనానుంచి కోలుకున్న తర్వాత కూడా అనారోగ్యంతో బాధపడుతున్న రోగులకు ఉపశమనం కలిగించేందుకు సీఎం జగన్ సానుకూలంగా స్పందించి పోస్ట్ కోవిడ్ మేనేజ్ మెంట్ స్కీంని కొత్తగా ప్రవేశ పెట్టారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఈ స్కీంను తక్షణమే అమలు చేయాలని సీఎం ఆదేశించినట్టు మంత్రి చెప్పారు. పోస్ట్ కొవిడ్ మేనేజ్ మెంట్ స్కీంలో రోజూ గరిష్టంగా ఆరోగ్యశ్రీ పరిధిలో రూ.2930 అందిస్తారు.