జగనన్న విద్యాదీవెన కార్యక్రమంలో భాగంగా.. విద్యార్థినీ విద్యార్థుల తల్లి అకౌంట్లో కాలేజీ ఫీజు జమ చేస్తోంది ప్రభుత్వం. అయితే కళాశాలలు ఇప్పుడిప్పుడే కొత్తగా తెరుస్తున్న నేపథ్యంలో ఫీజులకోసం విద్యార్థులపై ఒత్తిడి చేయొద్దని ప్రభుత్వం యాజమాన్యాలకు స్పష్టం చేసింది. ‘జగనన్న విద్యా దీవెన’ పథకం ద్వారా ఫీజుల చెల్లింపుల విధానానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది.