విద్యుత్ చార్జీల పెంపుపై విద్యుత్ పంపిణీ సంస్థలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. ఈ నెలాఖరులోగా రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలికి టారిఫ్ పెంపు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాయి. ఇటీవల తెలంగాణలో వరుసగా వస్తున్న ఎన్నికల వల్ల రెండేళ్లుగా చార్జీల పెంపు ప్రతిపాదనలను వాయిదా పడ్డాయి. దీంతో రెండేళ్ల తర్వాత చార్జీలు భారీ స్థాయిలో పెరుగుతాయనే అనుమానాలు తెలంగాణ వాసుల్లో బలపడుతున్నాయి. వరుస ఎన్నికల వల్ల చార్జీల పెంపు ముప్పు తప్పించుకున్నా... జీహెచ్ ఎంసీ ఎన్నికల తర్వాత మాత్రం తెలంగాణలో కరెంటు చార్జీల మోత భారీగా మోగుతుంది.