ఈరోజు తెలంగాణ సీఎం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఇందులో ప్రధానంగా కరోనా వల్ల రాష్ట్రానికి ఆర్ధికంగా జరిగిన నష్టం గురించి వీరితో చర్చించనున్నారు. అదేవిధంగా ఈ ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ విషయంపై మధ్యంతర సమీక్ష జరుపుతారు. ఈ సమీక్షకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, ఆర్థిక శాఖ అధికారులు హాజరుకానున్నట్లు తెలియవచ్చింది. ఈ మీటింగ్ తరువాత సీఎం రేపు మంత్రులు మరియు మిగిలిన అధికారులతో సమావేశమవుతారు.