ప్రస్తుతం నడుస్తున్నది పోటీ ప్రపంచం. యువత తమ లక్ష్యాన్ని సాధించే క్రమంలో అధిక పోటీని ఎదుర్కోవాల్సి వస్తోంది. దీంతో తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. వాస్తవ మేమిటంటే ఇలాంటి వాటిని ప్రతి వ్యక్తీ చదువులోనైనా, వ్యక్తిగత జీవితంలోనైనా ఎదుర్కోవాల్సిందే. వీటి నుంచి ఎవరూ తప్పించుకోలేరు. అపజయాలనేవి జీర్ణించుకోలేనివిగా ఉంటాయి. కానీ మనలో ఉండే సామర్థ్యాలపై నమ్మకం ఉంచి,కృషి సాగిస్తే విజయతీరాలకు చేరుకోవచ్చు. కాబట్టి గత చేదు అనుభవాలను విస్మరించి లక్ష్యం దిశగా అడుగులు వేయాలి.