ఏపీలో క్రమక్రమంగా కరోనా కేసులు బాగా తగ్గిపోతున్నాయి. ఇంకా సంతోషకరమైన విషయం ఏంటంటే.. కొత్తగా నమోదయ్యే కేసులకంటే డిశ్చార్జిల సంఖ్య చాలా ఎక్కువ. ఆ నిష్పత్తి తీసుకుంటే.. ఏపీలో కరోనా ప్రభావం పూర్తిగా నామమాత్రంగా మారిపోయింది. అంటే.. జీరో కేసుల వద్దకు చేరుకునే పరిస్థితి వచ్చేస్తోందని చెప్పాలి. అయితే ఎంత త్వరగా ఆ స్థితికి చేరుకున్నారో.. అంతే త్వరగా అక్కడినుంచి కేసులు బాగా పెరిగిన ఉదాహరణలు విదేశాల్లో ఉన్నాయి. అంటే ప్రస్తుతం ఏపీ కూడా అలాంటి స్థితికి వచ్చిందా అనే అనుమానాలు బలపడుతున్నాయి.