హైదరాబాద్ సినిమా సిటీ వ్యవహారంలో తెలంగాణ సీఎం కేసీఆర్ బాగా దూకుడుగా ఉన్నారు. హైదరాబాద్ శివార్లలో అంతర్జాతీయ స్థాయిలో సినిమా సిటీ నిర్మాణానికి 1500 నుంచి 2000 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తామని హామీ కూడా ఇచ్చారు. టాలీవుడ్ ప్రముఖులు, అధికారుల బృందం బల్గేరియా వెళ్లి అక్కడి సినిమా సిటీని పరిశీలించి హైదరాబాద్ లో కూడా అలాంటి నిర్మాణమే చేపట్టాలని ఆయన చెప్పారు. ఈమేరకు చిరంజీవి, నాగార్జునతో ఆయన ప్రగతి భవన్ లో సమావేశమయ్యారు. సినిమా సిటీ నిర్మాణం త్వరలోనే ప్రారంభించాలని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.