ఓవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే కరోనావైరస్ సెకండ్ వేవ్ కు సిద్ధంగా ఉండాలని డబ్ల్యూహెచ్‌వో ప్రకటిస్తే.... దీంతోపాటు రూపాన్ని మార్చుకొని వచ్చే ఈ కరోనా వైరస్ పై ఇంకెంత ప్రళయం తీసుకొస్తుంది అంటూ... ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కరోనా వైరస్ తన జన్యుక్రమాన్ని మార్చకోబోతున్నదని ఇప్పటికే పలు అధ్యయనాలు తెలిపాయి. ఒకసారి కరోనా వైరస్ తన రూపాన్ని మార్చుకుంది అంటే ప్రపంచమంతా తారుమారయ్యే అవకాశం లేకపోలేదు...వైరస్ లో కొత్త మార్పులు చోటు చేసుకొన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. డెన్మార్క్‌లో మింక్ అనే జీవి నుంచి ఈ వైరస్ మనుషులకు వ్యాపిస్తున్నట్లు ఆ దేశానికి చెందిన ది స్టేటెన్స్ సీరమ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు గుర్తించారు.